ఈ టైంలో ఇలాంటి ఫోటో అవసరమా… నటి అనుష్క శెట్టి ఫోటోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ సినిమా ద్వారా పరిచయం అయిన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ విధంగా వరుస సినిమాలతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే అధిక శరీర బరువు కారణంగా అనుష్క కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన శరీర ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈమె యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టితో కలిసి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా అనుష్క త్వరలోనే ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది. ఇకపోతే సినిమాల పరంగా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ అనుష్క అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలో తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రితో కలిసి దిగిన క్యూట్ ఫొటోస్ అనుష్క షేర్ చేసుకున్నారు.

ఇకపోతే తాజాగా తన సోదరుడు సాయి రమేష్ శెట్టి పుట్టినరోజు కావడంతో అతనితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో క్లారిటీగా లేకపోవడంతో వీరి మొహాలు మసకగా కనపడుతున్నాయి. దీంతో కొందరు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఈ టైంలో ఇలాంటి ఫోటో షేర్ చేయడం అవసరమా… కాస్త మంచిగా ఉన్న ఫోటో షేర్ చేయొచ్చు కదా స్వీటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.