‎Ghaati Movie: ఏంటి.. ఘాటి మూవీకి అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదా.. ఆ హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా!

Ghaati Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా వేదం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుష్క శెట్టి, క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా ఇది. ఈ మూవీలో విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణన్, జగపతి బాు, జిషు సేన్ గుప్తా, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఘాటీ సినిమాను నిర్మించారు.

‎ నాగవెల్లి విద్యాసాగర్‌ స్వరాలు సమకూర్చారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కు ముందే భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తీరా థియేటర్లలో విడుదల అయ్యాక మాత్రం ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది ఘాటీ సినిమా. ఇటీవల టీచర్స్ డే సందర్బంగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనికి తోడు పుష్ప సినిమాతో పోలీకలు ఉండడంతో ఈ మూవీపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఘాటీ సినిమా త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది.

‎అంతేకాకుండా నిర్మాతలకు కూడా భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలిసింది. కాగా ఈ సినిమా రిజల్ట్ తో అనుష్క కూడా పూర్తిగా నిరాశ చెందింది. అందుకే మూవీ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఘాటీ సినిమాకు అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదట. నిజానికి క్రిష్ ఈ సినిమాను అనుష్కతో చేయాలని మొదట అనుకోలేదట. ఈ సినిమాను ముందుగా లేడీ సూపర్ స్టార్‌ నయనతారతో చేయాలని అనుకున్నారట. ఆమె ఇంటికి వెళ్లి స్టోరీ కూడా వినిపించారట. అయితే ఆ స్టోరీ విన్న నయనతార పెద్దగా ఆసక్తి చూపించలేదట. సినిమాలో వైలెంట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం, పైగా అప్పటికే తన సినిమా డైరీ ఫుల్ కావడంతో ఘాటీ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో క్రిష్ అనుష్కను సంప్రదించారట. అప్పటికే తనకు వేదం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ కావడంతో స్వీటీ వెంటనే ఘాటీ మూవీకి ఓకే చెప్పేసిందట.