Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి మనందరికీ తెలిసిందే. అనుష్క ప్రస్తుతం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేసింది అనుష్క శెట్టి. ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇకపోతే అనుష్క శెట్టి ఇటీవల విక్రం ప్రభు హీరోగా నటించిన ఘాటి సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈమూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది.
UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. గంజాయి చుట్టూ కథ నడపడం, చివర్లో గంజాయి తాగవద్దు అని మెసేజ్ ఇవ్వడం లాంటి కథతో మంచి విజువల్స్ ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.
ఈ సినిమాతో అనుష్క ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడ్డారు. మూవీ యూనిట్ కొండలు, కోనల్లో సినిమా కోసం కష్టపడినా కూడా పెద్దగా ఫలితం రాలేదు. అయితే ఘాటీ సినిమా విడుదల అయిన నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. అనగా సినిమా విడుదల అయ్యి కనీసం మూడు వారాలు కూడా కాకముందే అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. కాగా ఈ ఘాటీ సినిమా నేడు సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే విషయాన్ని అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ఘాటీ స్ట్రీమింగ్ అవుతుందట. అయితే హిందీ వర్షన్ లేకపోవడం గమనార్హం. థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు వారాలకే అనుష్క లాంటి స్టార్ సినిమా ఓటీటీలోకి రావడం చర్చగా మారింది.
Anushka Shetty: విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చిన అనుష్క ప్లాప్ మూవీ!
