అమెరికాలో కప్పు చాయ్ కోసం అష్టకష్టాలు పడుతున్న సుమ.. వీడియో వైరల్!

తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా కొనసాగుతూ ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం తెలుగు కార్యక్రమాలన్నింటికి కాస్త విరామం ప్రకటించి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అమెరికాలో తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించడం కోసం అక్కడికి వెళ్లారు. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన సుమ వారి అతిథి సత్కారాలను అందుకున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమం పూర్తి అయినప్పటికీ ఈమె అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్కడి రెస్టారెంట్ లో రోబోల సర్వీస్ చూసి సుమ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే విధంగా అమెరికా వీధులలో తన టీంతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి.ఈ క్రమంలోనే సుమా ఈ వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈమె మరొక వీడియో ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు.అయితే అమెరికాలో సుమ చాలా కష్టపడుతున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేశారు.

సుమకు చాయ్ అంటే ఎంతో ఇష్టమట. కానీ అమెరికా వీధులలో ఏ రెస్టారెంట్ కు వెళ్లిన తనకు ఒక కప్పు చాయ్ దొరకలేదని తన బాధ మొత్తం బయట పెట్టింది. కప్పు చాయ్ కోసం చావాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఎక్కడికి వెళ్లిన తనకు ఒక కప్పు చాయ్ దొరకలేదని ఈ వీడియో ద్వారా తెలిపారు. ఇకపోతే ఎట్టకేలకు ఒక రెస్టారెంట్లో తనకు చాయ్ దొరికిందని,అమెరికాలో ఎవరైనా కాఫీ టీ బండి పెట్టుకుంటే చాలు విపరీతమైన డబ్బు సంపాదించవచ్చని ఈ సందర్భంగా సుమ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే ఈ వీడియోలో సుమ చెప్పే విధానం అందరికి నవ్వు తెప్పిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.