Sai Pallavi In Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో సాయి పల్లవి: ఈ సారి పక్కా.!

Sai Pallavi In Pawan Kalyan

Sai Pallavi In Pawan Kalyan : మెగా కాంపౌండ్ మూవీలో సాయి పల్లవి నటించింది లేదింతవరకూ. సూపర్ హిట్ తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్ కోసం మొదట్లో సాయి పల్లవిని సంప్రదించారు. మెగాస్టార్ హీరోగా ‘భోళా శంకర్’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా, రీమేక్ అన్న కారణంతో సాయి పల్లవి నో చెప్పిందట. అలా ఆ ప్లేస్‌ని కీర్తి సురేష్ రీ ప్లేస్ చేసింది.

అయితే, ఇప్పుడు మరో మెగా ఛాన్స్ సాయి పల్లవిని వరించిందట. పవన్ కళ్యాణ్ సినిమా కోసం సాయి పల్లవితో సంప్రదింపులు జరుగుతున్నాయట. అయితే, అది హీరోయిన్ పాత్ర కాదంటున్నారు. కానీ, ఓ పవర్ ఫుల్ రోల్ ‌అట. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆ క్యారెక్టర్ వుండబోతోందనీ తెలుస్తోంది.

సాయి పల్లవి కూడా ఈ రోల్ పోషించేందుకు ఆసక్తిగా వున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. దాదాపు ఈ ఆఫర్ ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి మంచి నటి. అందులో నో డౌట్. తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ‘ఫిదా’ చేసేసింది.

ఇక లేటెస్టుగా లేడీ పవర్ స్టార్ అనే ఇమేజ్ కూడా దక్కించేసుకుంది సాయి పల్లవి.. ఎలాంటి స్కిన్ షో లేకుండానే యూత్‌లో కూడా సాయి పల్లవి విపరీతమైన క్రేజ్ దక్కించుకోవడం విశేషం. ఇటీవల ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాలో మైత్రేయి అను దేవదాసి పాత్ర సాయి పల్లవిని నటిగా మరో మెట్టు పైకి ఎక్కేలా చేసింది.

ఇక తాజా ప్రచారంలో భాగంగా దక్కిన మెగా ఆఫర్‌ని ఎలాగైనా మిస్ చేసుకోకూడదని సాయి పల్లవి అనుకుంటోందట. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో సాయి పల్లవి ఛాన్స్ కొట్టేసిందన్నది వేచి చూడాలి.