Baby Movie: ఇదేందయ్యా ఇది.. హిందీలో బేబీ మూవీ రీమేక్.. నటీనటులు కావాలంటూ పోస్ట్!

Baby Movie: సాయి రాజేష్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య కలిసి నటించిన చిత్రం బేబీ. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కనెక్ట్ అయ్యారు. తక్కువ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. భారీగా కలెక్షన్లను సాధించింది. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో రికార్డుల మోత మోగించింది బేబీ మూవీ. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు డైరెక్టర్ సాయి రాజేష్.. బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.

అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు అందుకు నటీనటులు కావాలి అంటే ఒక వీడియోని షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా తో లింకప్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను పలు స్టార్ నటీనటుల పిల్లలతో చేద్దామని అనుకున్నారట. అంతేకాదు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోదరి, ఖుషీ కపూర్ తో చేద్దామని కూడా ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు సరికొత్త నటులు కావాలని పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఈ వీడియో చేశారు. అందులో ఆయన మాట్లాడారు..మీకు కూడా సినీ ఇండస్ట్రీ కి రావాలనుందా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వారికి బాలీవుడ్ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మేము ఒక సరికొత్త లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాము.

 

దానికోసం 18 నుంచి 23 సంవత్సరాలలోపు గల అమ్మాయిలు కావాలి. మీ కలర్ తో సంబంధం లేదు. ఏ కలర్ ఉన్నా ఇండియాలో ఏ మూలన ఉన్నా పర్లేదు. మాకు వాటితో అవసరం. రియల్ గా ఉండి మీలో యూనిక్ స్టైల్ ఉంటే చాలు అని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదేందయ్యా ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఇంకొందరు చాలా మంచి పని చేస్తున్నారు ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నా వారికి ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం అంటూ కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ గారు చాలా మంచి పని చేస్తున్నారు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అభిమానులు.