YSRCP: గత ఎన్నికలలో వైకాపా చెంతకు చేరినటువంటి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు వైయస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కాపు ఉద్యమనేతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్రగడ గత ఎన్నికల సమయంలో తప్పనిసరిగా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైకాపాలో చేరారు.
ఈ విధంగా ముద్రగడ పద్మనాభం తన కుమారుడి ఇద్దరు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు అయితే ఈయన కుమార్తె క్రాంతి మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడ్డారు. ఇటీవల ఆమె జనసేన పార్టీలోకి చేరిన సంగతి కూడా తెలిసిందే. ఇక వైకాపా పరాజయం పాలు కావడంతో ముద్రగడ సైతం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.
ఇలా వైకాపా ఓడిపోయినప్పటికీ ఈయన వైకాపాలో కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈయన కుమారుడు గిరి బాబుకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే పత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఇక ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
ఇక ముద్రగడ పద్మనాభం వైకాపా చెంతకు చేరడంతో గత ఎన్నికలలో భాగంగా ఈయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తారని అందరూ భావించారు కానీ ఈయనకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఇక అప్పట్లో ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ ఓటమిని టార్గెట్ చేస్తూ వచ్చారు. తప్పనిసరిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తాము అంటూ సవాల్ విసిరారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని తెలిపారు అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఈయన ఇచ్చిన మాట ప్రకారమే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకొని అందరికీ షాక్ ఇచ్చారు.