మీతో జర్నీ సంతోషాన్నిచ్చింది.. భర్త కష్టాన్ని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసిన తబిత!

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు ఆ టీం. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం హైదరాబాదులో ఈవెంట్ నిర్వహించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈవెంట్లో సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

సుకుమార్, బన్నీ అయితే కన్నీరు కూడా పెట్టుకున్నారు వారిని చూసి సుకుమార్ భార్య తబిత కూడా కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. అయితే సుకుమార్ భార్య సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డారని మేకింగ్ గ్లిప్స్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అంతేకాదు భర్త పడిన కష్టం గురించి ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు తబిత. ఈ సినిమా కేవలం ఇంట్రెస్టింగ్ కాదని, ఒక ఎమోషనల్ అని చెప్పకు వచ్చారు. ఇంట్లో కూర్చొని స్క్రిప్ట్ చదివిన దగ్గర నుంచి ఇంత పెద్ద వేదికపై నిలుచుని అందరి ప్రశంసలు అందుకుంటున్న మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం.

ఇప్పుడు మీ టాలెంట్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గుర్తిస్తారు.ఈ సక్సెస్ లో మీ పక్కన ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో జర్నీ నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. నిన్న ఈవెంట్ లో అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ కూడా వారి అనుబంధాన్ని వారి జర్నీని వారి సక్సెస్ ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

సుకుమార్ మాటలకి అయితే అల్లు అర్జున్ కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే అంతే కాదు తబిత కూడా ఆ మాటలకి ఎమోషనల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సుకుమార్ తనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా లెక్కచేయకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. సినిమా ప్రపంచమే పిచ్చిగా బ్రతుకుతున్న భర్తకి సపోర్ట్ ఇచ్చిన భార్యగా తబితకి కూడా హాట్సాఫ్ చెప్పాల్సిందే.