Varun Tej: హనుమాన్ మాల వేసుకున్న హీరో వరుణ్ తేజ్.. ప్రత్యేకంగా పూజలు.. ఇదంతా దానికోసమేనా!

Varun Tej: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం జయ అపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవలే మట్కా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు వరుణ్ తేజ్. ఈ సినిమా కోసం ఇంతకుముందు ఏ సినిమాకు కష్టపడని విధంగా చాలా కష్టపడ్డారు వరుణ్ తేజ్. ఎంతో హార్డ్ వర్క్ కూడా చేశారు. అంతే కాకుండా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా చేశాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయింది. దీంతో వరుణ్ తేజ్ తన సినిమాల పట్ల కాస్త నిరాశగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ సరైన సక్సెస్ సినిమా చూసి చాలా ఏళ్లయింది. ఆచితూచి కథలు ఎంపిక చేసుకున్నప్పటికీ అవి సరైన సక్సెస్ను సాధించలేకపోతున్నాయి.

దీంతో ఇటీవలే మట్కా సినిమా తర్వాత వెకేషన్ కి వెళ్ళిన వరుణ్ తేజ్ ఇప్పుడు సడన్గా ఒకసారిగా స్వామి మాలలో కనిపించి అభిమానులకు షాకిచ్చారు. తాజాగా వరుణ్ తేజ్ హనుమాన్ మాలలు ధరించారు. ఈ మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు కూడా అందజేసినట్టు తెలుస్తోంది. ఆలయాన్ని సందర్శించిన తర్వాత హనుమాన్ మాలను ధరించారు వరుణ్ తేజ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలు సరైన సక్సెస్ సాధించకపోవడంతో ఈ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

సక్సెస్ కోసమే వరుణ్ తేజ్ ఈ విధంగా పూజలు చేస్తున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇకపోతే వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇది ఒక హారర్ మూవీ అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సక్సెస్ కోసం వరుణ్ తేజ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మరి నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ను అందుకుంటారేమో చూడాలి మరి.