Tollywood: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ సినిమా పేరు మారుమోగుతోంది. ఇకపోతే ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచిన విషయం తెలిసిందే. ప్రీవియస్ షో కి ఒక్కో టికెట్ ధర 1100 నుంచి 1200 వరకు ఉంది. ఇక బెనిఫిట్ షోల టికెట్ ధరలు మొదటి నాలుగు రోజులు 350 నుంచి 500 పైన ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ రేట్లతో సినిమా చూసినా ఫ్యామిలీలు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. ఒక ఫ్యామిలీలో కనీసం నలుగురు ఉన్నా నలుగురు సినిమాకు వెళ్తే 2000 ఈజీగా అయిపోతాయి. దీంతో పుష్ప 2 టికెట్ రేట్ల పై సాధారణ ప్రేక్షకులలో చర్చ జరుగుతోంది. సోలోగా వెళ్తే తప్ప సినిమాను చూడలేము అన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.
ఫ్యామిలీతో కలిసి వెళితే జోబికి చిల్లులు పడాల్సిందే. ఇక పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ తో అంత డబ్బులు పెట్టి ఈ సినిమాకు వెళ్తే నెక్స్ట్ సినిమాలో పరిస్థితి ఏంటా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు అంత డబ్బులు పెట్టే సినిమాకు వెళ్లి మళ్లీ వెంట వెంటనే సినిమాలు చూడాలి అంటే చూడలేని పరిస్థితి. ఒక ఫ్యామిలీ అయినా లేదా యూత్ అయినా ఇప్పుడు 2000 ఒక్క సినిమాకే ఖర్చు పెడితే తర్వాత వచ్చే సినిమాలకు డబ్బులు పెట్టి చూస్తారా అనేది సందేహమే. ఈ నెలలో పుష్ప తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. అల్లరి నరేష్ బచ్చలమల్లి, ప్రియదర్శి సారంగపాణి జాతకం, ఉపేంద్ర యూఐ, నితిన్ రాబిన్ హుడ్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవి కాక చిన్న సినిమాలు మరో అరడజనుకు పైగా ఉన్నాయి.
చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే అల్లరి నరేష్ అలాగే నితిన్ సినిమాలు చూద్దామనుకున్నా వాటి ధర కనీసం 200 నుంచి ఉంటుంది. సమయంలో మళ్లీ ఫ్యామిలీతో కలిసి వెళ్లాలి అన్న మరొక 1000 ఖర్చు పెట్టాలి. మరి ఇప్పుడు పుష్ప సినిమాకు ఇంత ఖర్చుపెట్టి మళ్ళీ అది కూడా నెలాఖరున సినిమాలకు వెళ్తారా అనేది పెద్ద సందేహమే. దీంతో పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు ఈ నెలలో వచ్చే మిగిలిన సినిమాల కలెక్షన్స్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఒకవేళ టికెట్ రేటు ఇలాగే కనుక కొనసాగితే తప్పకుండా పుష్ప 2 సినిమా ఎఫెక్ట్ మిగతా సినిమాలపై ప్రభావం చూపిస్తుంది అన్నడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప 2కారణంగా ఇప్పటికే సినిమాల డేట్ ని అనౌన్స్ చేసుకున్న సినిమాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది.