Pushpa 2 Songs: మామూలుగా ఏవైనా కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఆ సినిమాలోని పాటలు విడుదల అవ్వడం అన్నది కామన్. సినిమా సక్సెస్ అవడంలో ముందుగా ఆ సినిమాలోని పాటలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప సినిమా విషయానికి వస్తే.. గతంలో విడుదల అయిన పుష్ప 1 సినిమా సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ సాధించాయో మనందరికీ తెలిసిందే. సినిమా విడుదల కాకముందే ఈ సినిమా పాటలు రికార్డుల మోత మోగించాయి. అంత మంచి సంగీతం అందించినందుకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కు జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే. పుష్ప 1 లో పాటలు అన్నీ కూడా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించాయి..
మరీ ముఖ్యంగా ఊ అంటావా మామ అనే పాట సినిమా విడుదల అయి ఏడాది అయినా కూడా ఆ పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2 మూవీ మరో రెండు రోజుల్లో రానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా టైటిల్ సాంగ్ పలు భాషల్లో 150+ మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ పాడిన ఈ పాట 72+ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. శ్రేయా ఘోషల్ ఆలపించిన సూసేకి తెలుగులో 160+ మిలియన్, హిందీలో 105+ మిలియన్, తమిళంలో 7.6+ మిలియన్ మలయాళంలో 1.1+ మిలియన్, కన్నడలో 34K+ వ్యూస్ దక్కించుకుంది. అలాగే అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది. విడుదలైన 18 గంటల్లో 25+ మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఇలా ఒక పాట ఒకదాని నిర్మించి ఒకటి యూట్యూబ్ లో మిలియన్ల స్థాయిలో వ్యూస్ ని రాబడుతూ దూసుకుపోతున్నాయి. దీంతో కేవలం సినిమా విషయంలోనే కాకుండా పాటల విషయంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు అల్లు అర్జున్. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది మా బన్నీ అంటే, పాటల విషయంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించాడు మా పుష్పరాజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. పుష్ప 2 సినిమా పాటలు బాగా వైరల్ అవుతూ రికార్డులు సృష్టిస్తున్న సందర్భంగా అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి రికార్డులు మా అల్లు అర్జున్ కే సాధ్యం సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.