కాంతార హీరో.. మరో గోల్డెన్ ప్రాజెక్ట్ పట్టేశాడుగా..

కాంతారతో ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్న రిషబ్ శెట్టి మరిన్ని ఆసక్తికరమైన సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తీసిన కాంతార సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం చరిత్రలో నిలిచిపోయింది.

ఇప్పుడు రిషబ్, తన తర్వాతి సినిమాలతో ప్యాన్ ఇండియా స్థాయికి దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న జై హనుమాన్ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు

ఈ సినిమా భారతీయ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతుండటం విశేషం. టెక్నికల్ టీమ్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాను ఇండియన్ సినిమాల గ్రాండియర్ రేంజ్‌లో నిలబెడతాయని ప్రచారం. మరోవైపు రిషబ్ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నారు. ది ప్రైడ్ అఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమా ద్వారా వీర శివాజీగా స్క్రీన్‌పై కనిపించబోతున్నారు.

సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. భారత దేశంలోని గొప్ప వీరుడి పాత్రను పోషించడం రిషబ్‌కు మరొక బిగ్ రోల్ గా మారబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నెవర్ బిఫోర్ లెవెల్‌లో తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి వచ్చిన ఈ బిగ్ బ్రేక్ అతడిని మరింత పైస్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. 2025లో కాంతార 2, 2026లో జై హనుమాన్, 2027లో శివాజీ మహారాజ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో రిషబ్ తన కెరీర్‌ను మరో లెవెల్ కు తీసుకువెళుతున్నాడు.