Chaitanya-Shobitha: నాగచైతన్య శోభితల పెళ్లికి హాజరు కాబోతున్న సెలబ్రిటీలు వీరే!

Chaitanya-Shobitha: అక్కినేని అభిమానులు, కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. నాగచైతన్య శోభితల పెళ్లి మరికొన్ని గంటల్లోనే జరగనుంది. మరికొద్ది గంటల్లోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. శోభిత అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టబోతోంది. పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు తుది దశకు వచ్చాయి. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మరి ఈ పెళ్లి వేడుకకు ఏ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు అన్న విషయానికి వస్తే.. నాగచైతన్య శోభితల వివాహానికి పుష్పరాజ్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇలా వీరితో పాటు టాలీవుడ్ కి చెందిన ఇంకా కొంతమంది సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. తెల్లవారితే అనగా రేపటి రోజున ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ జంటను ఆశీర్వదించడానికి చాలామంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మరి వీరితోపాటు ఇంకా ఎవరెవరు ఈ పెళ్లికి హాజరవుతారు అన్న విషయం తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి. ఇకపోతే ఇప్పటికే నాగచైతన్య శోభితలకు మంగళ స్నానాలు చేయించి పెళ్లికూతురుగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను శోభిత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సాంప్రదాయ పద్ధతులో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

శోభిత సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోతూ సిగ్గులొలికించారు. ఇక తన పెళ్లి దుస్తుల కోసం, శోభిత తల్లితో కలిసి స్వయంగా షాపింగ్‌ చేశారట. బంగారు జరీ వర్క్‌ తో కూడిన కాంచీవరం చీరను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరొక చీరను ఏపీలోని స్థానిక నేత పనివారితో చేయించగా, ఇంకొకటి పొందూరు ఖాదీ చీరను కూడా ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంటికి రాబోయే కోడలికి నాగార్జున ఖరీదైన కానుక ఇవ్వబోతున్నారని ఆ కుటుంబ సన్నిహితవర్గాలు అంటున్నాయి.