Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను… పేర్ని నాని షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో చేసిన హంగామా గురించి మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో హడావుడి చేయడంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ కాకపోయినప్పటికీ ఈయన మాత్రం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు ఎంతో అనుభవం ఉన్న రంగం కావడంతో షిప్ చుట్టూ గిరి గిర తిరిగారు ఇది మంచి ప్రయత్నమే అయినప్పటికీ ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి అంటూ ఈయన మాట్లాడారు.పోర్టు ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్ పవన్ తో బోటులోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ షిప్ లోనే ఉండి పవన్ కు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు. ఒకటి చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ వీరిద్దరూ పవన్ కళ్యాణ్ ని షిప్ ఎక్కనీవ్వద్దని చెప్పి అయినా ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ అబద్ధమైన చెప్పి ఉండాలి.

ప్రాణాలకు తెగించి స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేస్తామని చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేస్తామని చెబుతున్నారని ప్రశ్నించారు. కెన్ స్టార్ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ ను ఎందుకు అనలేదని ప్రశ్నించారు. ఐ విల్ టాక్ టు సెంట్రల్ మినిస్టర్ అని ఎందుకు అనలేదని అన్నారు. “స్టెల్లా షిప్ ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. ఆ కెన్ స్టార్ కు ఎందుకు వెళ్లరంటే ఆ ఎక్స్ పోర్టర్ పేరు వేల్పూరి శ్రీను. మంత్రి పయ్యావుల కేశవ్ కు స్వయానా వియ్యంకుడే ఈ వేల్పూరి శ్రీను. వేల్పూరి శ్రీను ఎక్స్ పోర్టు చేస్తున్న బియ్యంలో దొంగ బియ్యం ఉండవా? ఎందుకని ఆ షిప్ తనకి చెయ్యలేదు అంటూ వరుసగా పవన్ కళ్యాణ్ పర్యటనపై పేర్ని నాని ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.