Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మరో రెండు రోజుల్లో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన పుష్ప 1 సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ పుష్ప టు మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు అల్లు అర్జున్. ఇది ఇలా ఉంటే 2020లో విడుదలైన అలా వైకుంఠపురం లో సినిమా తర్వాత తన పూర్తి సమయాన్ని పుష్ప సినిమాకి కేటాయించారు అల్లు అర్జున్. అలవైకుంఠపురం సినిమాలో క్లీన్ షేవ్, రఫ్ లుక్ లో కనపడి అలరించాడు బన్నీ.
ఆ సినిమా తర్వాత నుంచి పుష్ప సినిమా కోసం గడ్డం పెంచడం మొదలు పెట్టాడు. పుష్ప కోసం మొదటిసారి బన్నీ ఫుల్ మాస్ లుక్ లో గడ్డం పెంచారు. సినిమాలో లుక్ కి తగ్గట్టు అప్పుడప్పుడు కొంత కట్ చేస్తూ ఆ ఫుల్ గడ్డాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇలా అల్లు అర్జున్ గడ్డం తీయక దాదాపు ఐదేళ్లు పూర్తి అవ్వబోతోంది. అల్లు అర్జున్ గడ్డం లుక్ అదిరిపోయిందని చెప్పాలి. పుష్ప 2 సినిమాలో కూడా ఈ గడ్డం లుక్ తోనే పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. ఇకపోతే ఈ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం తీసేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం గురించి అల్లు అర్జున్ ఇటీవల ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. నా గడ్డం కారణంగా నా కూతురు అర్హ నా దగ్గరికి వచ్చేది కూడా కాదు. దాంతో తనకి ప్రేమగా ముద్దు పెట్టలేకపోయాను. ఇలా తనతో ప్రేమగా లేక నాలుగు ఏళ్ళు అవుతోంది.
అందుకే నేను ఎప్పుడెప్పుడు ఈ గడ్డం తీసేద్దామా అని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు బన్నీ. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజయిన కొన్ని రోజులకే అల్లు అర్జున్ గడ్డం తీసేయబోతున్నాడని తెలుస్తోంది. ముందు తన కూతురి మీద ఉన్న ప్రేమతోనే గడ్డం తీసేస్తున్నాడని బన్నీ మాటల్లో అర్ధమవుతోంది. అంటే ఇప్పుడు పూర్తి గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్న అల్లు అర్జున్ మరి కొద్ది రోజుల్లో పూర్తి క్లీన్ షేవ్ లో కనిపించనున్నారు.