Allu Arjun: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు… అల్లు అర్జున్ పోస్ట్ వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిన ఒక ఏపీలో మినహా అన్ని చోట్ల కూడా టికెట్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి అయితే ఏపీలో టికెట్ల రేట్లు పెంపుదల విషయం గురించి సందిగ్ధత ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు.

ఇక ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా టికెట్లు పెంచే విషయం గురించి మాట్లాడారు అయితే అందుకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టికెట్లు రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతి తెలుపుతూ జీవో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏపీలో కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతి రావడంతో ఈ విషయంపై హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఈ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో ఆయన అమూల్యమైన మద్దతు ఇచ్చిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.