పవిత్ర ఆంటీకి అన్ని ఆస్తులా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ !

పవిత్ర లోకేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈ పేరు ఆ మధ్య కాలంలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నరేష్ తో ఆమె నడిపిన ప్రేమ, పెళ్లి వ్యవహారం ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె తల్లి, అత్త పాత్రలలో నటిస్తుంది. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ కన్నడ నటికి స్టార్ హీరోయిన్ లో కావలసినంత అందచందాలు పుష్కలంగా ఉన్నాయి.

కానీ ఎందుకో ఆమెని అదృష్టం అంతగా వరించలేదు. అయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమె స్టార్ హీరోయిన్ కి తీసిపోనంతగా సంపాదించింది అంటున్నారు సినిమా వర్గం వారు. ఆమె ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ ఆమె ఆస్తి వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం. పవిత్ర లోకేష్ ఇండస్ట్రీలో చాలా భాషలలో నటించింది.

ఈ క్రమంలోనే ఆమె సుమారు 70 కోట్ల వరకు ఆస్తులని సంపాదించినట్లు చెప్తున్నారు. బెంగళూరులో ఈమెకి అనేక అపార్ట్మెంట్ లతో పాటు పలుచోట్ల స్థలాలు కూడా ఉన్నాయి అని తెలుస్తోంది. అలాగే హైదరాబాదులో కూడా ఒక సొంత ఇల్లు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమె పెళ్లి చేసుకున్న నరేష్ కి ఉన్న ఆస్తుల సంగతి మనందరికీ తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ అయిన విజయనిర్మల వారసుడిగా 1500 కోట్లకు అధిపతి నరేష్.

ఇప్పుడు ఆయన భార్యగా ఆ ఆస్తికి వారసురాలుగా కూడా మారడంతో ఆమె ఆస్తులు విలువ మరింత పెరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వయసులో నరేష్ ని ఆస్తి కోసమే పవిత్ర పెళ్లి చేసుకుందని కామెంట్ చేశారు చాలామంది. అయినా ఇవేమీ పట్టించుకోని పవిత్ర తనకి నచ్చిన జీవితం గడుపుతూ ఇప్పటికీ నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో ఆమె చేసుకున్న పెళ్లి ఆమెకి ఆనందంతో పాటు ఆస్తులని కూడా తీసుకొచ్చాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.