ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అందుకే ఆ ప్రాజెక్టులు పెండింగ్ లో.. రేవంత్ రెడ్డి సీరియస్?

revanth reddy fires on trs govt over pending railway projects

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అసమర్థతను బయటపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.

revanth reddy fires on trs govt over pending railway projects
revanth reddy fires on trs govt over pending railway projects

తను ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై వెంటనే రైల్వే శాఖకు లేఖ రాశానని అన్నారు.

ఆ విషయంపై ఇటీవల కేంద్రం రైల్వే మంత్రి పియూష్ గోయల్ తోనూ చర్చించినట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. తాను రాసిన లేఖకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తిరిగి లేఖ పంపించారని.. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహకారం అందడం లేదని.. అందుకే.. రైల్వే ప్రాజెక్టులు ముందుకు వెళ్లడం లేదని రైల్వే మంత్రి స్పష్టం చేసినట్టు రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు మాకు ఎటువంటి మద్దతు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రైల్వే ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి.. అని రైల్వే జీఎం లేఖలో పేర్కొన్నారని రేవంత్ ఆరోపించారు.

అంతే కాదు.. తనకు రైల్వే మంత్రి నుంచి వచ్చిన లెటర్ కాపీని కూడా రేవంత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.