ఎర్ర బంగాళదుంపలు తినడం వల్ల కలిగే లాభాలివే.. ఈ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది ఎర్ర బంగాళదుంపలతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. తెల్ల బంగాళదుంపలతో పోల్చి చూస్తే ఎర్ర బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఎర్ర బంగాళదుంపలలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. ఎర్ర బంగాళాదుంపలు, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత సాధారణమైన బంగాళాదుంపలు కాగా ఇవి చిన్న సైజులో రుచిగా ఉంటాయి.

ఎర్ర బంగాళదుంపలలో కోలిసిస్టోకినిన్ అనే ప్రోటీన్ ఉండగా ఈ ప్రోటీన్ బూస్టింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఆకలిని మందగించేలా చేయడంలో ఈ ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే లక్షణాలు ఈ దుంపలలో ఎక్కువగానే ఉన్నాయి. ఈ దుంపల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

ఈ బంగాళదుంపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన జింక్, రాగి కూడా లభిస్తాయి. ఎర్ర బంగాళదుంపలు తీసుకోవడం ద్వారా ఎర్ర రక్త కణాల సంఖ్య సులువుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఐరన్ లోపంతో బాధ పడేవాళ్లు ఈ దుంపలు తినడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. బీపీతో బాధ పడేవాళ్లకు ఎర్ర బంగాళదుంపలు ప్రయోజనకరంగా ఉంటాయి.

ఎర్ర బంగాళదుంపలు తినడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఆరొగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎర్ర బంగాళదుంపలు సాధారణ బంగాళదుంపలతో పోల్చి చూస్తే ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఎర్ర బంగాళదుంపలను కొనుగోలు చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.