Chiranjeevi: నా మనసు ఉప్పొంగిపోయింది… పవన్ స్పీచ్ పై ఎమోషనల్ అయిన చిరు…. పోస్ట్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సినీ నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించారు.

ఇక ప్రస్తుతం ఈ పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు కావడంతో 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పిఠాపురం సమీపంలోని చిత్రాడ ప్రాంతంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు హాజరయ్యారు. ఇక వేలాది మంది జనసేన కార్యకర్తలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని.. అనేక కుట్రలు చేశారని అన్నారు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేవని అన్నారని.. కానీ ఇప్పుడు వందశాతం విజయం సాధించి జయకేతనం ఎగురవేస్తున్నామని అన్నారు. జయకేతనం కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ కి సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన స్పీచ్ గురించి చిరంజీవి కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ..మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ చిరు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.