AP: ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర ఉన్న టిడిపి పార్టీని నిలబెట్టింది మేమే అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇకపోతే మరోవైపు నాగబాబు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు అంటే ఆ గెలుపుకు కారణం ఏమి అని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి.
ఇలా పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరు కూడా టిడిపి పార్టీ గురించి మాట్లాడటంతో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఇద్దరి వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు ఇలాంటి తరుణంలోనే జనసేనకు ప్రముఖ సర్వే నిపుణులు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి.
ప్రముఖ సర్వే నిపుణులు ప్రవీణ్ పుల్లటి ఈ విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇందులో అలర్ట్ పిఠాపురం మాత్రమే కాదు..ఎక్కడైనా గెలిపించేది ప్రజలూ, పార్టీ కార్యకర్తలే! టీడీపీ మద్దతు లేకుంటే.. పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు లాంటి చోట్ల జనసేన గెలుపునకు ఛాన్స్ లేదని తేల్చేశారు. మరికొన్ని ప్రాంతాలలో జనసేన కారణంగా టిడిపి కూడా విజయం సాధించింది.
కూటమి మైత్రి వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చాం అనుకోవడం ఓ భ్రమ అని ప్రవీణ్ పుల్లట స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల మీద వ్యతిరేకత ఏర్పడటం వల్లే మీరు గెలిచారు అంటూ ప్రవీణ్ పుల్లట ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీ గెలుపుకు జగన్మోహన్ రెడ్డి కారణమంటూ ఈయన చెప్పకనే చెప్పేశారు.ఎప్పటికప్పుడు వైసిపి సాధించిన ఓట్ల శాతం కూడా జ్ఞప్తికి వస్తే మీరు మూలాలు మరిచిపోరన్నారు.
