Vijay Sai Reddy: విజయ్ సాయి రెడ్డి వైసీపీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన చుట్టూ మోహరించి ఉన్నటువంటి కోటరీ అంటూ ఇటీవల ఒక బాంబు పేల్చారు. ఆ కోటరీ ఉన్నన్ని రోజులు జగన్ సరైన నాయకుడు కాలేరని ఆ కోటరిని బద్దలు కొట్టుకు రావాలి అంటూ గతంలో ఓసారి జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
తాజాగా విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే తాజాగా రాజుల కథ చెబుతూ ఈయన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేశారు. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదంటూ ఎక్స్‌లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.
ఇక తెలివైన రాజైతే మారువేషంలో ప్రజలలోకి వచ్చి ప్రజల గురించి తెలుసుకునేవారు.పొగిడే వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ జగన్‌పై పరోక్షంగా ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.