Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంచు హీరోలు… కన్నప్ప కోసమేనా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటులు మంచు మోహన్ బాబు మా అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయనకు శాలువాలు కప్పి సన్మానించారు అనంతరం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా విష్ణు మోహన్ బాబు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు అనంతరం విష్ణు సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

అదేవిధంగా రేవంత్ రెడ్డితో బేటి కావడానికి గల కారణాలను కూడా ఈయన తెలిపారు. గౌరవనీయులైన తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో రాష్ట్ర అభివృద్ధి, తెలుగు చిత్ర పరిశ్రమ పురోగతి వంటి కీలక అంశాలపై చర్చించడం గొప్ప అనుభూతి. చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న మద్దతు, నిబద్ధత ప్రశంసనీయం అంటూ తెలియచేశారు.

ఇటీవల సినిమా పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రిని కలిసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ భేటీలో భాగంగా మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మంచు విష్ణు మాత్రం హాజరు కాలేకపోయారు ఈయన స్థానంలో నటుడు శివ బాలాజీని పంపించారు. కానీ ఇలా ప్రత్యేకంగా తన తండ్రితో కలిసి విష్ణు రేవంత్ రెడ్డిని కలవడంతో కన్నప్ప సినిమా బెనిఫిట్స్ కోసమే ఆయనని సంప్రదించి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు డ్రీ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు తెలంగాణలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అలాగే బెనిఫిట్ షో లతో పాటు సినిమా టికెట్ల రేట్లు పెంచాలని కోరుతూనే విష్ణు మోహన్ బాబు రేవంత్ రెడ్డిని కలిశారు అంటూ పలువురు చర్చలు జరుపుతున్నారు.