Raising Raju: అప్పుచేసి కూతురు పెళ్లి చేశాను… ఆది నా పాలిట దేవుడు… ఎమోషనల్ అయిన జబర్దస్త్ కమెడియన్!

Raising Raju: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సక్సెస్ అందుకున్న వారందరూ కూడా ప్రస్తుతం వెండి తెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రైజింగ్ రాజు ఒకరు. హైపర్ ఆది టీంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి ఆది దూరం కావడంతో రైజింగ్ రాజు కూడా పెద్దగా కనిపించలేదు ఏదో ఒక స్కిట్లో ఆయన అలా కనిపించి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రైజింగ్ రాజు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైజింగ్ రాజు ఎంతో ఎమోషనల్ అవుతూ ఆయన తన జీవితంలో పడిన ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు.

తాను జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు తన కూతురు పెళ్లి చేయాల్సి వచ్చింది అయితే ఆ సమయంలో నా దగ్గర ఏమాత్రం డబ్బు లేదు అప్పుచేసి నా కూతురు పెళ్లి చేశానని రైజింగ్ రాజు తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఆది తనకు ఎంతగానో సహాయం చేశారని రైజింగ్ రాజు తెలిపారు. ముఖ్యంగా కరోనా సమయంలో నా కుమార్తె డెలివరీ అయింది ఆ సమయంలో నాకు మనవరాలు పుట్టింది. చిన్న పాప కావడంతో తాను బయటకు వెళ్తే కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లే వాడిని కాదు. ఆ సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.

ఇలా తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా ఆది మాత్రం ప్రతినెల నాకు పేమెంట్ ఇంటికి పంపించేవాడని తెలిపారు. కరోనా కారణంగా నేను స్కిట్ చేయకపోయినా నా పరిస్థితి తెలుసుకొని ఆది తనకు పేమెంట్ పంపించేవారని ఆ విషయంలో అది నా పాలిట దేవుడు అంటూ ఈ సందర్భంగా రైజింగ్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.