Rashmika: చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించే అవకాశాలు దక్కించుకొని కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసింది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న అన్ని భాషలలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉండగా పుష్ప సినిమా విజయవంతం కావడంతో ఈ ముద్దుగుమ్మ ఏకంగా తన పారితోషికాన్ని కూడా పెంచినట్లు తెలుస్తోంది.పుష్ప పార్ట్ వన్ సినిమా కోసం రష్మిక రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఈమె పుష్ప సినిమా పార్ట్ 2 కోసం అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ పెంచి పుష్ప పార్ట్ 2 కోసం ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈమెకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఈమె అధిక మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
