Rishab Shetty: కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన మూవీ కాంతార. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా ముందు వరకు హీరో రిషబ్ శెట్టి ఎవరు అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ మూవీతో ఒక్కసారిగా గుర్తించి తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతార: చాప్టర్ 1 రూపొందుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడిగా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం అందిస్తున్నారు. అయితే తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ సాధించడంతో ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. తాజాగా మరో వార్త వైరల్ గా మారింది.
అదేమిటంటే ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ఏ స్థాయిలో పారితోషికం తీసుకోబోతున్నారు అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేమిటంటే స్టార్ హీరోస్ అందరూ సినిమాకు పారితోషికం కాకుండా సినిమాల్లో లాభాల్లో వాట తీసుకుంటున్న విషయం తెలిసిందే. అమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్లు సినిమా విజయం తర్వాత వచ్చే కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి సైతం అదే పనిచేయనున్నారని సమాచారం. కన్నడలో చాలా మంది ఆర్టిస్టులు తమ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుని తీసుకుంటారు. సినిమా హిట్ అయినా, కాకపోయినా అది నిర్మాతలపైనే పడుతుంది. అయితే ఇప్పుడు కాంతార 1 చిత్రానికి రిషబ్ శెట్టి అదే చేస్తున్నారట. కాంతార: చాప్టర్ 1 చిత్రానికి రిషబ్ శెట్టి ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో అతనికి హోంబాలే ఫిల్మ్స్ నుండి లాభం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదల కానుంది. ప్రీమియర్ అక్టోబర్ 1న ఉండనున్నాయి. ఈ చిత్రంలో రిషబ్ తో పాటుగా రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలకపాత్రలు పోషించారు. అయితే పారితోషికం కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది.
Rishab Shetty: కాంతార మూవీకి రిషబ్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
