Pushpa Effect on RRR : తన సినిమాలు పరంగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందరికీ తెలిసిందే. దర్శకునిగా సినిమా తీసి వదిలేయడమే కాకుండా మొత్తం సినిమా కూడా రిలీస్ అయ్యే వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఇక ప్రమోషన్స్ లో అయితే రాజమౌళిని కొట్టే దర్శకుడు ఇంకొకరు టాలీవుడ్ లో లేరని చెప్పాలి.
అయితే ఇప్పుడు రాజమౌళి తన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట. దీనికి ఓ రకంగా లేటెస్ట్ టాలీవుడ్ భారీ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఎఫెక్ట్ కారణం అని తెలుస్తోంది. ఈ సినిమాకి లాస్ట్ మినిట్ లో ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చాయో తెలిసిందే.
సెన్సార్ పనులు పరంగా కానీ సినిమా వివిధ భాషలకు ఓవర్సీస్ కి ప్రింట్ వెళ్ళడానికి కానీ చివరి నిమిషంలో పుష్ప కి ఇబ్బందులు నెలకొన్నాయి. అయితే ఇవేవీ తన సినిమాకి ఉండకూడదు అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. అల్రెడీ తన సినిమా ప్రింట్ లను ఆయా భాషల్లో ఆల్రెడీ సెన్సార్ కి పంపేసినట్టు తెలుస్తోంది.
అలాగే ఓవర్సీస్ మార్కెట్ కి సంబంధించి కూడా కీలక జాగ్రత్తలు రాజమౌళి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీనితో రాజమౌళి తన సినిమా పట్ల ఎంత కేర్ గా ఉన్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించాడు. అలాగే ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 7 న విడుదల కానుంది.