త్రివిక్రమ్ ఫేక్ పోస్ట్స్ అలర్ట్..నిర్మాతల సంచలన క్లారిటీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోసం తెలుగు ప్రేక్షకులకి కొత్తగా చెప్పనవసరం లేదు. తాను చేసిన సినిమాలు తన డైలాగ్స్ ఎంతటి మ్యాజిక్ ని చేస్తాయో అందరికీ తెలుసు. మరి ఇదిలా ఉండగా త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ తో భీమ్లా నాయక్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో త్రివిక్ర్మ్ పేరిట కొన్ని ఫేక్ పోస్టులు వైరల్ అవ్వడం కలకలం రేపింది. 
 
ఏపీలో టికెట్ ధరలకు సంబంధించి నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇందులో సారాంశం. అయితే దీనిపైనే చిత్ర యూనిట్ టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ కి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని, తన ఫోటో కానీ పేరు కానీ పెట్టి ఎవరైనా పోస్ట్ చేస్తే అందుకు అతను బాధ్యుడు కాదని సంచలన క్లారిటీ ఇచ్చారు. 
 
ఒకవేళ త్రివిక్రమ్ సైడ్ ఏమన్నా వస్తే తన నిర్మాణ సంస్థ ఫార్చూన్ 4 సినిమాస్, హారిక హాసిని నుంచి వస్తాయని ఏపీ ప్రభుత్వ హ్యాండిల్ ని పేర్ని నాని ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసి సంచలన క్లారిటీ ఇచ్చారు.