ఐఎన్ఎస్ విశాఖపట్నంపై పొలిటికల్ ఏడుపు.!

విశాఖపట్నం.. ప్రస్తుతం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. ఆర్థిక పరిపుష్టి కలిగిన నగరం. పారిశ్రామికీకరణ జరిగిన నగరం. పట్టణీకరణ పరంగా చూసినా విశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన నగరం. ఐటీ రంగం పరంగా చూసుకున్నా, మరే విభాగంలో అయినా విశాఖకు సాటి రాగల నగరం ఇంకోటి లేదు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.

కానీ, కొందరు మాత్రం విశాఖ పేరు చెబితేనే హడలిపోతున్నారు. ఆ ఏడుపుని ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక మీద కూడా షురూ చేశారు. యుద్ధ నౌకల పేర్ల విషయంలో రకరకాల అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక అతి త్వరలో నావికా దళంలో అధికారికంగా చేరబోతోంది.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానున్న నేపథ్యంలో ఈ నౌక విషయమై ఇండియన్ నేవీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, నౌక ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికింది. అంతే, వివాదం మొదలెట్టాయి రాజకీయ పక్షాలు. యుద్ధ నౌకకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అని ఎలా పేరు పెడతారంటూ మొసలి కన్నీరు కార్చేస్తున్నాయి.

విశాఖపట్నం క్లాస్.. పేరుతో కొన్ని యుద్ధ నౌకలు ఇప్పటికే అందుబాటులో వున్నాయి. వాటిల్లో లీడ్ షిప్ ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఎందుకు వుండాలి.? ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ పోర్‌బందర్.. పేరుతో ఈ క్లాస్‌లో యుద్ధ నౌకలు ఇప్పటికే అందుబాటులో వున్నాయి.
రాజకీయం.. అన్నిట్లోనూ రాజకీయం.. చివరికి రక్షణ శాఖ విషయంలోనూ నికృష్ట రాజకీయమా.?