అయోమయంలో హరీష్ శంకర్.!

సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ యాక్టివ్‌గానే కనిపిస్తున్నాడు. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్స్ ఏంటి.? అంటే, మౌనం దాల్చుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొన్నాళ్ళ క్రితం తక్కువ రోజుల వ్యవధిలో కొంత పార్ట్ షూట్ చేశారు. మళ్ళీ మధ్యలో ఇంకొంత పార్ట్ షూట్ చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారు.

ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. వెరసి, పవన్ కళ్యాణ్ ప్రయాణం కొంత గందరగోళంగానే నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మరోపక్క, ఏపీలోనూ రాజకీయాలు వేడెక్కాయి.

పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే షూట్ ప్లాన్ చేస్తామని కొన్నాళ్ళ క్రితం స్వయంగా హరీష్ శంకర్ చెప్పాడు. కానీ, షూటింగ్ మాత్రం హైద్రాబాద్‌లోనే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మళ్ళీ జనంలోకి వెళ్ళనున్న దరిమిలా, హరీష్ శంకర్ షెడ్యూల్స్ ఏమవుతాయో ఎవరికీ అర్థం కావడంలేదు.

నిజానికి, ఇదో సంకట పరిస్థితి హరీష్ శంకర్‌కి. కానీ, ‘దేవుడు’ పవన్ కళ్యాణ్‌ని ‘భక్తుడు’ హరీష్ శంకర్ ఏమీ అనలేడు కదా.!