నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్.!

సినీ రంగంలో స్టార్‌డమ్ తెచ్చుకుని, రాజకీయాల్లో రాణిస్తోందామె. ఆమె ఈ మధ్య ఓ కాంట్రవర్సీలో చిక్కుంది. ఆమెకి మద్దతుగా కొందరు నిన్నటితరం నటీనటులూ స్పందిస్తున్నారు.

ఈ కోవలోనే, తనకు బాగా పరిచయమున్న ఓ నటితో సదరు నటి కమ్ పొలిటీషియన్ మాట్లాడారట. తనకు అనుకూలంగా మాట్లాడాల్సిందిగా అభ్యర్థించారట. అయితే, ఆ పొలిటీషియన్ కోరికని సున్నితంగా తిరస్కరించిందట ఆ నటి.

ఎందుకంటే, ఇప్పటికే స్పందించిన నటీమణుల మీద ట్రోలింగ్ గట్టిగా జరుగుతోంది. స్పందించినవాళ్ళలో చాలామందికి రాజకీయాలతో టచ్ వుంది.. పైగా, వాళ్ళంతా వెల్ సెటిల్డ్.

ఇక్కడ, ఈ నటి పరిస్థితి వేరు. అందుకే, మాట్లాడగలిగే సత్తా వున్నా.. కాస్త తటపటాయించినట్లు తెలుస్తోంది. పైగా, ఆమె ఇంకో పార్టీతో టచ్‌లో వున్నారు. అన్నిటికీ మించి, గతంలో ఓ విషయమై నోరు పారేసుకున్నందుకు చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారామె.

సినిమా వేరు.. రాజకీయం వేరు.. అనుకోవడానికి వీల్లేదు. అందులో ఇదుంది, ఇందులో అదీ వుంది.!