వేరుశెనగలు ఈ సమస్య ఉన్నవారు తింటే అంతే సంగతులు.. అది ఏంటంటే?

పేదల భాదంగా పిలిచే వేరుశనగలు ఎక్కువగాచలికాలంలో దొరుకుతుంటాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో అనేక రకాల పోషకాలతో పాటు పొటాషియం, జింక్, విటమిన్ ఇ, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. చలికాలంలో వేరుశెనగ కాయలు తినడం వల్ల ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. వేరుశెనగ గింజల తొక్కల్లో ఆరోగ్యాన్ని పెంచే రోజువారి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. వేరుశెనగలో ఉండే విటమిన్- ఇ, ఫైబర్, జింక్, శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి.అలా అని వేరుశెనగలను ఎక్కువగా తిన్నా కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఏ సమస్య ఉన్నవారు వేరు శనగలను తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

అసిడిటీ కావచ్చు : వేరుశెనగలను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగకపోగా, ఇది మలబద్ధకం,గ్యాస్,ఆసిడిటి, గుండెల్లో మంట ఇలాంటి సమస్యలకు దారి తీస్తుంది.

కీళ్ల నొప్పులు పెరగవచ్చు : కీళ్ల నొప్పులతో బాధపడే వారు వేరుశెనగను తినకుండా ఉండటం మంచిది. ఇది లెక్టీన్ లను కలిగి ఉండటంతోపాటు నొప్పి లేదా మంటను పెంచుతుంది.

కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది : ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అప్లాటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది కాలేయానికి గణనీయమైన నష్టాన్ని కలిగించే హానికరమైన పదార్థం.