సమ్మర్ మొదలయ్యింది అంటే చాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందుకే వైద్యులు సమ్మర్ లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పై ప్రత్యేక వహించాలని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది ఆరోగ్యంగా ఉండడం కోసం బలంగా ఉండడం కోసం డ్రై ఫ్రూట్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు చాలామందికి ఒక సందేహం కలిగే ఉంటుంది. వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినవచ్చా తినకూడదా? తింటే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా? లేదా ఇలా ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి.. మరి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముఖ్యంగా సమ్మర్ లో వాల్ నట్స్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాల్‌నట్స్ చాలా పోషకాలు కలిగి ఉన్నాయి. అలాంటి వాల్‌నట్స్ ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. అయితే వేసవిలో వాల్ నట్స్ తినడం మంచిదే కానీ తినే విధానాన్ని మార్చుకోవాలి అంటున్నారు వైద్యులు. వాల్‌నట్స్‌లో మంచి మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి, ఆరోగ్యకరమైన మెదడుకు మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, వేసవి కాలం వేడిగా ఉంటుంది, వాల్‌నట్స్ కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి, కానీ, వేసవిలో వాల్‌నట్స్ తినేందుకు ఉపాయం ఉంది. అందుకోసం వాల్‌నట్స్ తినే ముందు రాత్రంతా నానబెట్టడం.
ఇది వాల్‌నట్ లలోని వేడిని శాంతింపజేస్తుంది. చాలా మంది వాల్ నట్స్ ను నేరుగా తింటారు. వాల్‌నట్‌లను పాలలో మరిగించి తింటే పోషకాలు ఎక్కువ. వాల్‌నట్‌లను పాలలో వేసి మరిగించి గోరువెచ్చని పాలతో రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. దీంతో మంచి నిద్రకు దోహదం చేస్తుంది. వాల్‌నట్ వంటి గింజలు మెలటోనిన్‌కు మంచి మూలంగా పరిగణించబడతాయి. ఈ గింజల్లో ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మీకు మంచి నిద్రను అందిస్తాయి. మీరు అనేక విధాలుగా మీ ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవచ్చు. ఇది షేక్ లేదా స్మూతీతో మరింత బాగుంటుంది. వేసవిలో వాల్‌నట్‌లను తినడానికి ఇది చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన మార్గం. అలాగే, వేసవిలో వేయించిన వాల్ నట్స్ తినడం చాలా మంచిది.
ఇలా తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తినడం వల్ల శరీరంలోని వేడిని సమతుల్యం చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు పెరుగులో వాల్‌నట్‌లను నానబెట్టుకుని తింటే కూడా మంచిది. మీరు కావాలంటే 2 వాల్‌నట్ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినండి. నానబెట్టిన వాల్‌నట్స్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్టయితే, మీరు క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకుంటే అది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.