Health Tips: వేసవిలో ప్రతిరోజు చల్లని నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

మామూలుగా వేసే కాలం వచ్చింది అంటే చాలు ఎండలు మండిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా విపరీతమైన చెమట కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక వేసవికాలం చాలామంది వేసవితాపాన్ని తట్టుకోలేక చల్లనీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. కొందరు వేసవిలో ఎక్కువగా చల్లనిటితోనే స్నానం చేస్తూ ఉంటారు. మరి సమ్మర్ లో ప్రతిరోజు చల్ల నీటితో స్నానం చేయవచ్చా ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవికాలంలో చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రతిరోజు చన్నీళ్ల స్నానం చేయడం ఎంతో మంచిది. చల్లటి నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే వాపులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. లితంగా ఆరోగ్యంగా ఉంటాము. చన్నీటి స్నానంతో డిప్రెషన్ నుండి రిలాక్స్ చన్నీళ్ల స్నానం చేస్తే ఏదో జరుగుతుంది అన్న అపోహ వద్దని, చన్నీళ్ల స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రేరేపితం అవుతుంది. ఇది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. వేసవిలో చల్ల నీటి స్నానం ఒత్తిడి కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఐదు నిమిషాల పాటు చన్నీటి స్నానం చేయడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఫీల్ గుడ్ ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.

వ్యాధి నిరోధక శక్తి కోసం చన్నీటి స్నానం చన్నీటి స్నానం చేయడం వల్ల మన హృదయ స్పందన రేటు కరెక్ట్ గా మారుతుంది. అలాగే రక్తపోటు తగ్గుతుంది. ఆక్సిజన్ సక్రమంగా తీసుకోగలం. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో రోజు చన్నీళ్ళతో స్నానం చేస్తే ఎంతో మంచిది. చర్మం, జుట్టుకు చన్నీటి స్నానం మేలు చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలోని ల్యూకోసైట్లు ప్రేరేపితం అవుతాయి. ఇవి మనల్ని సాధారణ అనారోగ్యాల నుండి కాపాడతాయి. కాబట్టి వేసవిలో చల్ల నీటితో స్నానం చేసే వారు ఎటువంటి ఆందోళన భయం లేకుండా నిర్మొహమాటంగా స్నానం చేయవచ్చు.