రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ.. అడ్డంకులన్నీ తొలగిపోయాయి

No hurdles for Ram Charan, Shankar project
No hurdles for Ram Charan, Shankar project
 
‘ఆర్ఆర్ఆర్’ చేసే చిత్రం దాదాపు అదే స్థాయిలో ఉండాలని భావించిన రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమాకి సైన్ చేశారు.  శంకర్ మొదటిసారి ఒక తెలుగు హీరోతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తుండటంతో చరణ్ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ నెలకొంది.  రాజమౌళి సినిమా నుండి రిలీఫ్ దొరకగానే శంకర్ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని చరణ్ భావించారు.  నిర్మాత దిల్ రాజు కూడ ఎప్పుడంటే అప్పుడే అన్నట్టు రెడీగా ఉన్నారు. కానీ ‘ఇండియన్-2’ నిర్మాతల రూపంలో అడ్డంకులు మొదలయ్యాయి.  తమ సినిమా కంప్లీట్ చేస్తేనే కానీ శంకర్ వేరొక సినిమా మొదలుపెట్టడానికి లేదని కోర్టుకు వెళ్లారు వాళ్ళు.
 
దీంతో శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ డైలమాలో పడిపోయాయి.  ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా మీద క్లారిటీ లేకుండా పోయింది.  కోర్టు వారు శంకర్, లైకా నిర్మాతలను సయోధ్య కుదుర్చుకోమని అవకాశం కూడ ఇచ్చారు.  కానీ ఇరు పక్షాల నడుమ సర్దుబాటు కుదరలేదు.  దీంతో రామ్ చరణ్ అభిమానుల్లో నిరాశ ఎక్కువైంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి.  రామ్ చరణ్ సైతం శంకర్ సమక్షంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు.  అయితే అందరికీ ఊరట కలిగించేలా ఒక వార్త బయటికి వచ్చింది.  అదేమిటంటే శంకర్ తమ సినిమా పూర్తికాకుండా వేరే సినిమాకు వెళ్లకూడదని లైకా నిర్మాతలు వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసిందట.  దీంతో రామ్ చరణ్ సినిమాకు అన్ని అడ్డంకులు తొలగినట్టే అయింది.