Dil Raju: ఆ వార్తలు నిజం కావు, దయచేసి పుకార్లు ప్రచారం చేయకండి: ప్రొడ్యూసర్ దిల్ రాజు

Dil Raju: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము” అన్నారు నిర్మాత దిల్ రాజు.”ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాము.

దయచేసి అప్పటి వరకు మా నుండి అధికారిక సమాచారం వచ్చేదాకా ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను మీ గౌరవ మీడియా లో ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాము” అని దిల్ రాజు గారు తెలియజేశారు

అమరావతి భూ స్కామ్ || Analyst Ks Prasad EXPOSED Amaravati Land SCAM || YCP Vs TDP || Chandrababu ||TR