“స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి ప్రజా ప్రతినిధులు బాధ్యతలు చేపడితే కరోనాను మరింత సమర్ధవంతంగా నియంత్రించగలం” — ఎన్నికల కమిషనర్
ఈ మాటే మార్చిలో ఎన్నికలు వాయిదా వేయకుండా జరిపి ఉంటే కరోనా వల్ల 8 వేలమంది చనిపోయేవారు కాదేమో! ఇప్పుడయినా రోజుకు 700 కేసులు వస్తున్నాయి. అప్పటికింకా కేసులే లేవు.
“ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు” — ఎన్నికల కమిషనర్
అప్పట్లో ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా వేయడానికి ఏ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు?
ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి అంటున్నప్పుడు 2018లో ఈ రాజ్యాంగ విధి ఏమయింది?
ఇవన్నీ ప్రభుత్వం వైపు నుండి, అధికార పార్టీ వైపు నుండి వస్తున్న ప్రశ్నలు.
మార్చిలో ప్రతిపక్ష, ఎన్నికల కమిషనర్ వాదనలు, ప్రభుత్వ, అధికారపక్ష ప్రతివాదనలు, భిన్నంగా, ఘర్షణ పూరితంగానే ఉన్నాయి.ఇప్పుడు ప్రతిపక్ష, ఎన్నికల కమిషన్ వాదనలు, అధికారపక్ష, ప్రభుత్వ ప్రతివాదనలు ఘర్షణ పూరితంగానే ఉన్నాయి.
అప్పుడూ, ఇప్పుడూ ఎన్నికల కమిషన్ వాదనను ప్రతిపక్షం సమర్ధిస్తోంది. అలాగే అధికారపక్ష వాదనను ప్రభుత్వం వినిపిస్తోంది.
సంప్రదింపులతో పనిచేయాల్సిన వ్యవస్థలు ఘర్షణకు దిగితే, వ్యవస్థల ప్రాధాన్యం పక్కకు వెళ్ళి వ్యక్తుల అహం ముందుకొస్తే వివాదమే మిగులుతుంది.