మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 సినిమాపై ఇప్పుడే హైప్ స్టార్ట్ అయింది. ఈ సినిమా ఇండియన్ సినిమా రేంజ్‌నే మార్చేదిగా ఉండబోతుందనేది ట్రేడ్ టాక్. ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్స్, భారీ బడ్జెట్, అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌కి తోడు.. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో రాజమౌళి జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకుంటున్నాడు.
ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ కోసం దర్శకుడు దేవా కట్టా ఎంపికయ్యే ఛాన్సులు ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదుగానీ, రాజమౌళికి దేవా కట్టా స్టైల్ బాగా నచ్చుతుందని బాహుబలి వెబ్‌సిరీస్ వర్క్ సమయంలోనే తెలిసిందట. అదే అనుబంధం SSMB29లో మళ్లీ పనిచేసేలా చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
దేవా కట్టా డైరెక్టర్‌గా ప్రస్తుతం ఫామ్‌లో లేని మాట వాస్తవమే కానీ, రచయితగా మాత్రం అతని డైలాగ్స్‌కు ప్రత్యేక మార్క్ ఉంది. ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్స్ సోషల్ ఎమోషన్‌తో కలిపి కథను మళ్లించాయి. ఇప్పుడు SSMB29లో మహేష్ బాబు పాత్ర చాలా లోతుగా ఉంటుందని తెలుస్తోంది. అలాంటి పాత్రకు భావోద్వేగంతో కూడిన డైలాగ్స్ అవసరమవుతాయి.
ఆ బరువైన మాటల కోసం దేవా కట్టా మంచి ఎంపిక అవుతారని ఇండస్ట్రీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఇప్పటికే కథను ఫిక్స్ చేశాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ వర్క్ స్టేజ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో దేవా కట్టా పేరూ వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఇది ఆయనకు మరోసారి ఇండస్ట్రీలో నిలబడే అవకాశం కావొచ్చు.