Pawan Kalyan: ఏపీలో 2024 ఎన్నికలలో కూటమి పార్టీలు అద్భుతమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ బీజేపీతో మాట్లాడి పొత్తుకు ఓకే చెప్పించడంతోనే ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలలోకి వచ్చి మంచి విజయం సాధించాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో తిరిగి కూటమి ప్రభుత్వం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ 8 నెలల కాలంలో రాజకీయాల పరంగా ఎంతో యాక్టివ్గా కనిపించారు.
ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తుంటే కూటమిలో ఏదో జరుగుతుందనే స్పష్టం అవుతుంది. కూటమి నేతల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తేనే అర్థమవుతుంది. రాజకీయాల పరంగా ఎంతో యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపు 15 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉండిపోయారు. వారం రోజులలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ అలాగే కీలక సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు.
ఇలా పవన్ కళ్యాణ్ వారం వ్యవధిలో జరిగిన రెండు కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఈ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఈయన అనారోగ్యానికి గురయ్యారని వైరల్ ఫీవర్ రావడంతోనే క్యాబినెట్ మీటింగ్ కు రాలేదంటూ అధికారిక ప్రకటన చేశారు కానీ నిన్న జరిగిన కీలక నేతల సమావేశానికి కూడా ఈయన హాజరు కాకపోవడంతో సర్వత్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటే అది కూడా లేదు నేటి నుంచి ఈయన దక్షిణాది ఆధ్యాత్మిక టూర్ కూడా వెళ్తున్న విషయం తెలిసిందే . దీంతో ఎందుకని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. పవన్ చివరిగా రిపబ్లిక్ డే సందర్భంగా బహిరంగ వేదికపై కనిపించారు అప్పటినుంచి ఈయన ఎక్కడ కనిపించలేదు. మరి పవన్ దక్షిణ భారత దేశ యాత్రల తరువాత అయినా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటే కనుక ఈ రకమైన రూమర్లకు చెక్ పడుతుంది. లేకపోతే ఏదో జరుగుతుందని అనుమానాలు కూటమి పార్టీల చీలికకు కూడా కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు.