Corona Virus: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదైన కరోనా కేసులు.. గత 24 గంటల్లో 29 మందికి పాజిటివ్..!

Corona Virus: 2 సంవత్సరాల క్రితం చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపించి, ఒక్కో దశలో ఒక్కో విధంగా రూపాంతరం చెంది ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. కరోనా మొదటి రెండవ వేవ్ లలో అధిక ప్రాణనష్టం జరిగినప్పటికీ ప్రభుత్వాలు ప్రజలందరికీ కరోనా టీకాలు వేయటంతో మూడవ వేవ్ లో ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లలేదు.ప్రస్తుతానికి మన భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. చైనా వంటి పలు దేశాలలో కరోనా నాలుగవ వేవ్ మొదలైంది. చైనాలో కరోనా కట్టడి కోసం కొన్ని ప్రధానమైన నగరాలలో లాక్ డౌన్ అమలు చేశారు.

తాజాగా మన భారతదేశంలో కూడా 1259 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కూడా నాలుగవ వేవ్ ప్రారంభ సూచికలు కనిపిస్తున్నాయని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి , శానిటైజర్ తరుచుగా వాడుతూ ఉండాలని సూచించింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా గత 24 గంటలలో 6369 మందికి కరోనా పరీక్షలు చేయగా 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కూడా కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. అనంతపురం జిల్లాలో తాజాగా 10 కొత్త కరోనా కేసులు రాగా.. తూర్పుగోదావరి జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు కరోనా తో ఎవరు మరణించలేదని రాష్ట్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది.