కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది.

థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు ప్రేమ జియం సినిమాటోగ్రఫర్, ఆల్డ్రిన్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించారు.మార్టిన్ పాల్ సిఎస్ ఈ చిత్రానికి ఎడిటర్.

మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్. గోపు బాలాజీ, హర్రర్ లో ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక సరికొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ విడుదల కానున్నాయి. అలాగే విడుదల తేదీని కూడా యూనిట్ సభ్యులు త్వరలో ప్రకటించబోతున్నారు.

