Bharat Taxi: ‘భారత్ ట్యాక్సీ’ని చంద్రబాబు గమనించలేదా..?

Bharat Taxi: రవాణా రంగానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సిటీల్లో రవాణా రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నవి ఉబర్, ఓలా వంటి ప్రైవేటు సంస్థలనే సంగతి తెలిసిందే. దీంతో.. రకరకాల ఛార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నారని అంటున్నారు. మరోవైపు డైవర్ల నుంచి సుమారు 30% వరకూ కమిషన్ వసూల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం “భారత్ ట్యాక్సీ” అనే కొత్త యాప్ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.

నిజంగా ప్రైవేటు సంస్థల ఆధీనంలోనే ప్రభుత్వ సంస్థలు ఉంటే.. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అనుకుంటే.. ఉబర్, ఓలా లకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ భారత్ ట్యాక్సీ యాప్ ను ఎందుకు తెచ్చింది?

ప్రయాణికులు తరచూ ఎదుర్కొనే రద్దీ సమయాల్లో ఎక్కువ ధరలు, డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్ మొదలైన సమస్యలనుంచి ఉపశమనం కోసమే భారత్ ట్యాక్సీ యాప్ అని ఎందుకు చెబుతున్నారు?

డ్రైవర్ల సంపాదనలో 30% వరకూ ప్రైవేటు సంస్థలు కమిషన్ తీసుకుంటున్నాయని చెబుతోన్న వేళ.. భారత్ ట్యాక్సీ 20% మాత్రమే మెయింటినెన్స్ ఛార్జీలు కట్ చేసేలా దీన్ని ఎందుకు రూపొందించారు?

నిజంగా ఈ విషయంలో మోడీ కూడా చంద్రబాబులా ఆలోచించి.. ఉబర్, ఓలాలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి, భారత్ ట్యాక్సీ అనే ఆలోచన విరమించుకోవచ్చు కదా? లేదా భారత్ ట్యాక్సీనీ పీపీపీ పేరున ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టొచ్చు కదా?

కాస్త ఇంగితం ఉన్నవారు ఎవరూ అలా ఆలోచించరు! ఎందుకంటే.. సామాన్యుడు ఎప్పుడూ ప్రభుత్వం వైపే చూస్తాడు.. నిజమైన ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన్న ఆలోచించాలి.. అంతే కదా?

ఇప్పటివరకూ క్యాబ్ సర్వీసులంటే ఓలా, ఊబర్, ర్యాపిడో వంటివి మాత్రమే కనిపించేవి. అవి పూర్తిగా ప్రైవేటు సంస్థల ఆధిపత్యంలో నడిచేవి. ఈ నేపథ్యంలో.. ఈ ఆన్ లైన్ ట్యాక్సీ మార్కెట్ లోకి ప్రభుత్వ మద్దతుతో “భారత్ ట్యాక్సీ” సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ ఛార్జీలు వంటి సమస్యలతో విసిగిపోతున్న ప్రయాణికులకు, తక్కువ కమిషనలతో సర్ధుకుపోతూ సతమతమవుతున్న డ్రైవర్లకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా రాబోతోంది.

నగరజీవికి తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా మొదలవబోతున్న ఈ ప్రయోగం 2026 జనవరి 1 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై సిటీలోని సామాన్యుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే.. ఇకపై తమపై పెత్తనం చేసే ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సిన పని లేదని!

ఈ నేపథ్యంలో… ఈ విషయాన్ని ఏపీలో చంద్రబాబు సర్కార్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతుందనేది సామాన్యుడి ప్రశ్నగా ఉంది. ప్రైవేటు సంస్థలు ఎప్పుడూ వ్యాపారాన్ని చేస్తాయి.. ప్రజలకు సర్వీస్ అందిస్తూ, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని భావిస్తుంటాయి.. ఆ విధంగా ముందుకు వెళ్తుంటాయి! అయితే ప్రభుత్వాలు అలా ఆలోచించకూడదు కదా! అవి ప్రజల కోసం, ప్రజల వలన ఏర్పడినవి కదా!

ఈ క్రమంలోనే.. ఈ చిన్న చిన్న విషయాలను అయినా పరిగణలోకి తీసుకుని.. కేంద్రంలో మోడీ సర్కార్ ఆలోచిస్తున్న స్థాయిలో ఆలోచించాలని.. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి పేదలకు దూరం చేస్తూ, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకూడదని ఈ సందర్భంగా ఏపీ ప్రజానికం కోరుతున్నారు. ఈ విజ్ఞప్తి సర్కార్ చెవులకు చేరి, మెదడును తాకాలని ప్రార్థిస్తున్నారు!

సిగ్గులేదా || Analyst Chinta Rajasekhar Fires On Chandrababu Over Amaravati Land Scam | Shivaji | TR