థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని డైలాగ్ చెబుతూ కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న నటుడు పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న పృద్విరాజ్ గత ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ పార్టీ విజయంలో కీలకంగా మారారు. ఆ సమయంలో పార్టీ కోసం పృథ్వీరాజ్ పైన కష్టాటికి ప్రతిఫలంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ కి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఆ సమయంలో పృధ్విరాజ్ మీద వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా చైర్మన్ పదవి నుండి తొలగించారు.
అప్పటినుండి పృథ్వి జగన్ మీద అతని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఆంధ్రజ్యోతి ఛానల్ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ఇంటర్వ్యూలో పృథ్వి పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృద్వి జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు విసుగు చెందారని, ప్రజలే జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టే సమయం వస్తుంది అంటు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకు ఈ సందర్భంగా క్షమాపణలు తెలియజేశాడు.
అంతేకాకుండా జగన్ పరిపాలన గురించి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో ప్రజలు కల్తీ మద్యానికి బానిసలై ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు సంపాదించినదంతా మద్యం కోసం వెచ్చిస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఇప్పుడు క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు ని వైఎస్సార్‌సీపీ నేతలు దూషించినప్పుడు రాష్ట్రంలోని మహిళలు చాలా బాధపడ్డారని పృథ్వి రాజ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో జగన్ మళ్లీ ప్రజలను ఓట్లు అడిగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల జగన్ గురించి..ఆయన పరిపాలన గురించి పృధ్వి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.