భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన తమన్!

తమన్ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు మంచి మ్యూజికల్ హిట్ అందుకున్నాయి. ఇక తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని తమన్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ తన భార్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన భార్యతో కలిసి తనకు స్టేజ్ షోలు చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టారు. అయితే తమన్ భార్య ఏం చేస్తుంటారు ఏంటి అనే విషయానికి వస్తే… తమన్ భార్య పేరు శ్రీ వర్దిని. ఈమె ప్లేబ్యాక్ సింగర్ గా పని చేస్తుంటారు.

ఇప్పటివరకు శ్రీ వర్దిని తమన్ సంగీత సారథ్యంలో నాలుగు సినిమాలకు పాటలు పాడారు. అదేవిధంగా
ఆమె గతంలో మణిశర్మ, యువన్‌ శంకర్‌ రాజా వద్ద కొన్ని పాటలు పాడింది. ఇలా పలు సినిమాలలో పాటలు పాడిన తనకు సరైన గుర్తింపు రాలేదు. తన భార్యకు ఎప్పుడైతే సింగర్ గా మంచి గుర్తింపు వస్తుందో అప్పుడే తాను తన భార్యతో కలిసి స్టేజి షో చేస్తానని ఈ సందర్భంగా తమన్ తన భార్య గురించి మనసులో మాటను బయట పెట్టారు.