టర్కీలో భారీ భూకంపం, సునామీ.. కుప్పకూలిన భవనాలు.. జనాల పరుగులు.. వీడియోలు

earthquake and tsunami in turkey

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీతో పాటుగా గ్రీస్ దేశాన్ని కూడా భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. సముద్రంలో భూమి కంపించడంతో సముద్రపు నీళ్లు ముందుకు రావడంతో చిన్నపాటి సునామీ వచ్చింది. దీంతో జనాలంతా రోడ్ల మీదికి పరుగులు తీశారు. భవనాలన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.

earthquake and tsunami in turkey
earthquake and tsunami in turkey

రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదయింది. భారీ భూకంపం వల్ల టర్కీలోని ఇజ్మీర్ లో చాలామటుకు భవనాలు కుప్పకూలాయి. సునామీ వల్ల సముద్రపు నీరంతా వీధుల్లోకి వచ్చి చేరింది. మరోవైపు గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో భూమి కంపించింది. అలాగే ఐలాండ్ సామోస్ లోనూ భూకంపం వచ్చింది. టర్కీ, గ్రీస్ దేశాల్లో సంభవించిన భూకంపానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


https://twitter.com/YiannisBab/status/1322157831655665664