Nagababu: పిఠాపురంలో నాగబాబుకు నిరసనసగా… నాగబాబు నోటి దూలే కారణమా?

Nagababu: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మొదటిసారి అధికారకంగా ప్రభుత్వ కార్యకలాపాలలో ఎమ్మెల్సీగా పాల్గొంటున్నారు అయితే గత రెండు రోజులుగా ఈయన పిఠాపురంలో పర్యటన చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు రోజులు పిఠాపురం పర్యటనలో భాగంగా నాగబాబుకు నిరసనసగా తగులుతుంది. నాగబాబు పలు కార్యక్రమాలలో పాల్గొన్న చోటకు పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు హాజరవుతూ తెలుగుదేశం పార్టీ జెండాలను పట్టుకొని జైవర్మ అంటూ నినాదాలు చేశారు.

కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లగా.. నాగబాబును చుట్టుముట్టిన టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సీనియర్ జనసేన, టీడీపీ నేతలు వివాదం ముదరకుండా తమ కార్యకర్తలను అడ్డుకొని గొడవ జరగకుండా ఆపారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా నాగబాబును టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదని చెప్పాలి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతగానో కష్టపడ్డారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు అయితే తీరా గెలిచిన తర్వాత నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విజయం వెనుక ప్రజలు ఉన్నారని తెలిపారు. తమవల్ల పవన్ గెలిచారని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ పరోక్షంగా వర్మ గురించి మాట్లాడారు.

ఇలా నాగబాబు వర్మ గురించి చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ అనుచరులు నాగబాబు పర్యటన సమయంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఇలాంటి తరుణంలో ఆయన ప్రతి ఒక్క మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అది జనసేన పార్టీపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అంటూ పలువురు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా నాగబాబు తన ధోరణి మార్చుకుంటారా లేదా అది దూకుడు స్వభావంతో వ్యవహరిస్తారా తెలియాల్సి ఉంది.