బాలకృష్ణ వ్యక్తిత్వం అలాంటిది.. ఆయన సినిమాలకు నేనే ముహూర్తం పెట్టాను: వేణు స్వామి

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈయన గురించి పరిచయం అవసరం లేదు జ్యోతిష్యుడుగా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా సినీ సెలబ్రిటీల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో సమంత నాగచైతన్య వివాహం చేసుకోబోతున్నారని తెలియడంతో వీరి వివాహం జరిగిన విడిపోతారంటూ కామెంట్ చేశారు.ఈయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ఒక్కసారిగా ఈయన ఫేమస్ అయ్యారు.అప్పటినుంచి ఈయన ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలకు హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వేణు స్వామి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వేణు స్వామి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారు చూడటానికి ఎంతో గాంబీర్యంగా ఉన్నప్పటికీ ఆయన మనసు ఎంతో మంచిదని తెలిపారు.ఇకపోతే బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు సరైన ముహూర్తం నేనే పెట్టానని అలాగే తన జీవితంలో జరగబోయే విషయాల గురించి తాను వెల్లడించానని వేణు స్వామి తెలిపారు.

ఇలా నేను చెప్పినవన్నీ జరిగిన అనంతరం బాలకృష్ణ గారు ఫోన్ చేసి తాను చెప్పినట్టే జరిగాయని ఎన్నోసార్లు తనకు చెప్పారని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. ఇక ఆయన అందరిలా ఏ విషయాన్ని మనసులో దాచుకోరని ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడితే వ్యక్తిత్వం తనది అంటూ బాలకృష్ణ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం టర్కీకి వెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.