బికినీలో నిహారిక.. మెగా పరువు తీస్తుందంటూ మండిపడుతున్న ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా నిహారిక మాత్రమే అడుగుపెట్టారు. బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిహారిక అనంతరం పలు సినిమాలలో కూడా నటించారు.ఇలా హీరోయిన్ గా ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ సక్సెస్ కాకపోవడంతో ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారారు. ఇలా వెబ్ సిరీస్ లను నేర్పించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియా వేదికగా ఈమె ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం టర్కీ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే టర్కీ వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా టర్కీలో తన స్నేహితులతో కలిసి ఈ ఏకంగా బికినీలో సందడి చేశారు ఈ క్రమంలోని ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఫోటో పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.ఇక మెగా అభిమానులు సైతం ఈ ఫోటోలపై స్పందించి మెగా కుటుంబం పరువు మొత్తం నిహారిక తీస్తుందంటూ పెద్ద ఎత్తున బికినీ ఫోటోల పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇక గతంలో కూడా ఈమె ఓ పబ్ ఘటనలో భాగంగా పోలీసులకు పట్టుబడటం సంచలనం రేపింది. అప్పటినుంచి నిహారికను సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.