సినిమా షూటింగ్ ను నిలిపివేసి టర్కీలో కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన బాలయ్య?

టాలీవుడ్ సీనియర్ నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఇలా ఈయన మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలా కృష్ణంరాజు మరణించడంతో సినీ ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కున కోల్పోయిందని ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయన మంచితనం గురించి కొనియాడుతూ వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈయనను చివరి చూపు కోసం ఎంతోమంది సినీ తారలు తరలివచ్చి కృష్ణంరాజు గారికి కన్నీటి వీడ్కోలు పలికారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ నిమిత్తం టర్కీలో ఉన్నారు. అయితే కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న టువంటి బాలకృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈయన మరణ వార్త తెలియగానే వెంటనే తన సినిమా షూటింగ్ ఆపివేసి చిత్ర బృందంతో కలిసి కొన్ని నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఆయనకు టర్కీ నుంచి నివాళులు అర్పించారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్నటువంటి ఈయన సంతాపం ప్రకటించడమే కాకుండా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక కృష్ణంరాజుకు బాలకృష్ణకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన కృష్ణంరాజుని పితృ సమానులుగా భావిస్తారు. ఇక బాలకృష్ణ తన సినిమా షూటింగ్ ఆపేవేసి కృష్ణంరాజు గారికి నివాళులు అర్పించారంటే ఆయన పట్ల బాలకృష్ణకు ఏ విధమైనటువంటి గౌరవం అనుబంధం ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.