Star Heros: 2027 వరకు ఈ స్టార్స్ దొరకడం కష్టమే..

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు సినిమాల షెడ్యూల్‌తో బిజీగా మారిపోయారు. ఒకప్పుడు సంవత్సరానికి ఒక సినిమా తీద్దామనుకునే హీరోలు.. ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల వరకు ప్రాజెక్టుల్ని లాక్ చేసుకున్నారు. ఈ పరిస్థితిలో డైరెక్టర్లు, కొత్త నిర్మాతలు స్టార్ హీరోల డేట్స్‌ కోసం 2027 వరకూ ఎదురు చూడాల్సి వస్తోంది. పెద్ద హీరోల క్యాలెండర్లు చూస్తే.. భవిష్యత్తులో కూడా కొత్త ప్రాజెక్ట్స్‌కి ఛాన్స్ రావడం కష్టమేననిపిస్తోంది.

ప్రభాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ‘ద రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో.. వీటన్నీ 2027 వరకూ ప్రభాస్ కాలెండర్ నింపేశాయి. అంతేకాదు, అతడి సినిమాలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులకైతే కనీవినీ ఎరుగని పండగే.

ఇక ఎన్టీఆర్ కూడా వరుస సినిమాల‌తో ఫుల్ బిజీ. వార్ 2, దేవర 2, ప్రశాంత్ నీల్ మూవీ, నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించే కొత్త సినిమా ఇలా నాలుగు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. RRR తర్వాత బాలీవుడ్‌ డిమాండ్‌ పెరిగిన తారక్.. హృతిక్‌తో స్క్రీన్ షేర్ చేయనున్న ‘వార్ 2’ కోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నారు. దేవర 2 కోసం కొరటాల శివతో కూడా చర్చలు ముగిశాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాల మధ్యలో సినిమాలు చేస్తున్నారు. OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు లాంటి సినిమాల షూటింగ్ దశలవారీగా పూర్తవుతోంది. పవన్ ఇక నుంచి కొత్త ప్రాజెక్ట్స్ చేయటం కష్టం అనిపిస్తోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ల పరిస్థితీ ఇదే. బన్నీ ‘పుష్ప 2’ తర్వాత అట్లీతో, త్రివిక్రమ్‌తో సినిమాలు చేస్తుండగా.. చరణ్ బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలతో బిజీ. మహేష్ బాబు మాత్రం రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న SSMB29 కోసం పూర్తిగా డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా పూర్తయ్యేలోగా మరో ప్రాజెక్ట్ తీసుకోవడం కష్టమే.

Pithapuram Public Reaction On Pawan Kalyan & Naga Babu || Ap Public Talk || Svsn Varma || TR